Verse
గడియ నేను తట్టుచున్నాను
మూఢముగా నుండక మనసు తెరువుము
Verse
భోజనము చేయనై శాంతిగా నిల్చుచున్నాను
ఆసనమునిచ్చిన ప్రేమను రుచింతువు
Verse
ఆనందము పొందును నీ హృదయము నాకిమ్ము
కష్టదుఃఖముల నెల్ల పారద్రోలెదను
Verse
నేనే మృతి పొందితిని నీ నాథుడను యేసు రాజును
పైన వెళ్ళి తండ్రితో మాటలాడుదు నీకై
Verse
నా శిరస్సునందు ముండ్ల మకుటము ధరియించితిన్
హేమమకుత మీయను త్రోసినట్టి నీకై
Verse
తామసము చేయక హృదయమును తెరువుము
తెల్లని వస్త్రములతో నిన్నలంకరింతును
Verse
సైతాను దూతలను పారద్రోలెదను నేను
నాతాను ద్వారా నీకు పశ్చాత్తాపమిత్తును
Verse
హల్లెలూయ పాడి నీ హృదయమును కిమ్ము
ప్రయుడనై నేను త్వరగా నీకై వత్తును