Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaganamu Cheelchukoni

గగనము చీల్చుకొని

Gaganamu Cheelchukoni

Lyricist: Hosanna Ministries
Verse
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా‖ 2x ‖
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది‖ 2x ‖
ఉల్లసించుచున్నది…‖ గగనము ‖
Verse
నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది‖ 2x ‖
పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను‖ 2x ‖
నీ కౌగిలిలో నేను విశ్రమింతును‖ 2x గగనము ‖
Verse
నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది‖ 2x ‖
కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను‖ 2x ‖
యుగయుగాలు నీతో ఏలెదను‖ 2x గగనము ‖
Verse
నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది‖ 2x ‖
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో‖ 2x ‖
సీయోనులో నీతో నేనుందును‖ 2x గగనము ‖

Related Tags

WorshipSecond ComingRapture