Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni

Lyricist: Freddy Paul
Verse
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది
Verse
నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది
పవిత్రురాలైన కన్యకగా
నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును...
Verse
నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది
కళంకము లేని వధువునై
నిరీక్షణతో నిను చేరెదను
యుగయుగాలు నీతో ఏలేదను...
Verse
నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో
సీయోనులో నీతో నేనుందును...

Related Tags

WorshipSecond ComingDevotional