Verse
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
Verse
పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో‖ గగనము ‖
Verse
మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను
కొదమసింహపురీతి కదలెను గర్జనతో‖ గగనము ‖
Verse
కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు‖ గగనము ‖