Verse
గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచు-కున్న నావ‖ 2x ‖
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా‖ గలిలయ ‖
Verse
యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన‖ 2x ‖
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా‖ గలిలయ ‖
Verse
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా‖ 2x ‖
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా‖ గలిలయ ‖