Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gamyam Cheraalani Neetho Undaalani Pagalu Reya

గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయ

Gamyam Cheraalani Neetho Undaalani Pagalu Reya

Chorus
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
Verse
భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
Verse
అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరసును వంచి నమస్కరించాలనీ
వేదన బాధలు గుండెని పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో ఇలలో నా తుది శ్వాసను వడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని

Related Tags

WorshipDevotionalLonging