Verse
గత కాలమంత నిను కాచిన దేవుడు
ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను
ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి
ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి
Verse
మట్టి కుండగా పుట్టించి నిన్ను
కంటి పాపగా కాపాడినాడు‖ 2x ‖
అందాలాలెన్నో ఎక్కించువాడు
అందరిలో నిన్ను మెప్పించుతాడు‖ 2x ఇయ్యి ‖
Verse
యేసుని హత్తుకో ఈ లోకమందు
ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు‖ 2x ‖
తలను ఎత్తుకొని పైకెత్తి చూడు
మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు‖ 2x ఇయ్యి ‖
Verse
కష్టాలలో నిన్ను కాపాడినాడు
నష్టాలలో నిన్ను కాపాడినాడు‖ 2x ‖
నీవు నమ్ముకుంటే నిను వదులలేడు
నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు‖ 2x ఇయ్యి ‖