Verse
గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె
నిత్యఁడౌ ప్రభువా‖ గతకాలములయందు ఘనసహాయుడ దేవా ‖
Verse
నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము
భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా
నొప్పు ప్రభువా ఘన దేవా‖ గతకాలములయందు ఘనసహాయుడ దేవా ‖
Verse
నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత
ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు
మేము‖ గతకాలములయందు ఘనసహాయుడ దేవా ‖
Verse
వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము
సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము
సుమియవ్వి‖ గతకాలములయందు ఘనసహాయుడ దేవా ‖
Verse
గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ
మీవె నిత్యుడౌ ప్రభువా‖ గతకాలములయందు ఘనసహాయుడ దేవా ‖