Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Geetam Geetam Jaya Jaya Geetham Cheyithatti

గీతం గీతం జయ జయగీతం చేయితట్టి

Geetam Geetam Jaya Jaya Geetham Cheyithatti

Chorus
గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము
Verse
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు
వేసిన ముద్ర కావలినిల్చెను నా దైవ సుతుని ముందు‖ గీతం ‖
Verse
వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను
చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి‖ గీతం ‖
Verse
అన్న కయపవారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక
భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి‖ గీతం ‖
Verse
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి‖ గీతం ‖

Related Tags

VictoryResurrectionEaster