Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Geetham Geetham

గీతం గీతం

Geetham Geetham

Lyricist: Songs Of Zion
Verse
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము‖ 2x ‖
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము‖ 2x గీతం ‖
Verse
చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు‖ గీతం ‖
Verse
వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి‖ గీతం ‖
Verse
అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి‖ గీతం ‖
Verse
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి‖ గీతం ‖

Related Tags

PraiseResurrectionEaster