Chorus
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము
Pre-Chorus
యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము
Verse
చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా
దైవసుతుని ముందు
Verse
వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి
Verse
అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి
Verse
గుమ్మలు తెరిచి చక్కగ నడువుడు - జయ వీరుడు రాగా
మీ మేళ తాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి