Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Geethamulu Paadudee Yesuniki Sam Gee

గీతములు పాడుఁడీ యేసునికి సం గీ

Geethamulu Paadudee Yesuniki Sam Gee

Lyricist: Murari David
Chorus
గీతములు పాడుఁడీ యేసునికి సం గీతములు పాడుఁడీ పాతకుల
మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి
పాపను భాతకులలో నవతరించెను‖ గీతములు ‖
Verse
రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యమున కర్తగా బూజలందుచు
దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి
యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను‖ గీతములు ‖
Verse
దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను
యేసు నాధుఁడు దీన వృత్తిని‖ గీతములు ‖
Verse
మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన
రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా
దీనుఁడై యిమ్మానుయేలు‖ గీతములు ‖
Verse
ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా
మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు
తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును‖ గీతములు ‖

Related Tags

WorshipJesusChristmas