Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghana Bhava Dhupakruthu Lanu Maatiki Ne Vi

ఘన భవ దుపకృతు లను మాటికి నే వి

Ghana Bhava Dhupakruthu Lanu Maatiki Ne Vi

Lyricist: Mikkili Namuyelu
Chorus
ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత
యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత‖ ఘన ‖
Verse
ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా
పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా‖ ఘన ‖
Verse
జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా
ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా‖ ఘన ‖
Verse
మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద
నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా‖ ఘన ‖

Related Tags

PraiseThanksgiving