Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghana Yehova Nee Gudaaram Buna Nathithiya

ఘన యెహోవా నీ గుడారం బున నతిథియ

Ghana Yehova Nee Gudaaram Buna Nathithiya

Lyricist: Mallela David
Chorus
ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర
నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు‖ ఘన ‖
Verse
వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో
మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ‖ ఘన ‖
Verse
తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు
తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు‖ ఘన ‖
Verse
వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన
నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు‖ ఘన ‖
Verse
మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము
అరయఁ డిట్టులఁ జేయువాఀడే ధర నెపుడు గదల్పఁబడఁడు‖ ఘన ‖
Verse
జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును
పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్‖ జనక ‖

Related Tags

WorshipHolinessRighteousness