Chorus
ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్
ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము
లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు‖ ఘనదేవ ‖
Verse
అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము
ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి
ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక‖ ఘనదేవ ‖
Verse
అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్
మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు
గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు‖ ఘనదేవ ‖
Verse
దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో
భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల
వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము‖ ఘనదేవ ‖
Verse
పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము
సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర
ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో‖ ఘనదేవ ‖
Verse
కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా
సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా
పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము‖ ఘనదేవ ‖
Verse
భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా
నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప
జూపుచును రక్షించు మనిశము‖ ఘనదేవ ‖