Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghanadeva Putrudagu Ghanamaina Yesubiddan

ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్

Ghanadeva Putrudagu Ghanamaina Yesubiddan

Chorus
ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్‖ 2x ‖
జనులారా స్తోత్రించి ముద్దులాడుడి‖ 2x ‖
Verse
పాడుడి మళ్ళి పాడుడీ‖ 2x ‖
పాపుల విమోచకుడు
ప్రభు యేసు రక్షకుడు‖ 2x ‖
నేడుద్భవించెను బెత్లెహేమున‖ 2x ఘన ‖
Verse
తట్టుడి కేలు తట్టుడీ‖ 2x ‖
తండ్రియగు దేవుడిచ్చె
తన యొక్క ముద్దు పాపన్‖ 2x ‖
నిట్టూర్పులింకేల పాపలోకమా‖ 2x ఘన ‖
Verse
చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ‖ 2x ‖
తొట్టిలోన బట్టతోను
చుట్టబడ్డ యేసు పట్టిన్‖ 2x ‖
గట్టిగాను పాదసేవ జేయుడి‖ 2x ఘన ‖
Verse
దేవుడే తానైననూ‖ 2x ‖
దాస్యంపు రూపమును దాల్చుకొన్న
యేసునాధున్‖ 2x ‖
విశ్వాస ప్రేమతోను బట్టుమా‖ 2x ఘన ‖
Verse
హీనమైన దాసుడా!‖ 2x ‖
మానవుని ఘనపర్చ దీనుడాయె
ఘన యేసు‖ 2x ‖
ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు‖ 2x ఘన ‖

Related Tags

WorshipJesusChristmas