Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghanamaina Kreesthu Krupao Ganugonti Na

ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి న

Ghanamaina Kreesthu Krupao Ganugonti Na

Lyricist: Yesudasu Narsayya
Chorus
ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁ
గాఁచి పెంచెను నన్ను‖ ఘనమైన ‖
Verse
ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చే
జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి
స్ధిరపరచె నిపుడు‖ ఘనమైన ‖
Verse
ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచి
మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁ
జూడక తనదు వెంట రమ్మనెను‖ ఘనమైన ‖
Verse
కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేఁపవలె వదల
కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను
కన్నీరు వల పోసినాఁడు‖ ఘనమైన ‖
Verse
పర్వతములపైఁ గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి
తంబుగాను సర్వజనులకు వెలుఁగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు‖ ఘనమైన ‖
Verse
సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను
మోక్ష మోసఁగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి
నరకమున వేతునని పలికెన్‖ ఘనమైన ‖

Related Tags

PraiseGraceSalvation