Verse
ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు‖ 2x ‖
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ – కృపా సత్యములను ప్రకటింతును‖ 2x ఘనమైన ‖
Verse
నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము‖ 2x ‖
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా‖ 2x ‖
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా‖ 2x ‖
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు‖ 2x ఘనమైన ‖
Verse
మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము‖ 2x ‖
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా‖ 2x ‖
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా‖ 2x ‖
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు‖ 2x ఘనమైన ‖
Verse
సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు‖ 2x ‖
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా‖ 2x ‖
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా‖ 2x ‖
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు‖ 2x ఘనమైన ‖