Verse 1
కరుణించి కాపాడే యేసయ్యా..
యేసయ్యా… యేసయ్యా..
Verse
కూడుకొని మనమీవేళ
ఘనమగు వేడుకకు తెర తీయాలా‖ 2x ‖
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై‖ కూడుకొని ‖
Verse
వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే
విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
గానమై గళమున పాడగా
ధ్యానమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్య నాద రూపాన‖ కూడుకొని ‖
Verse
పాతవి కడ తేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే
ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన‖ కూడుకొని ‖