Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghanamainavi Nee Kaaryamulu

ఘనమైనవి నీ కార్యములు

Ghanamainavi Nee Kaaryamulu

Lyricist: Hosanna Ministries
Verse
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా‖ 2x ‖
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా‖ 2x ‖
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే‖ 2x ఘనమైనవి ‖
Verse
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు‖ 2x ‖
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము‖ ఘనమైనవి ‖
Verse
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే‖ 2x ‖
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము‖ ఘనమైనవి ‖
Verse
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే‖ 2x ‖
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము‖ ఘనమైనవి ‖

Related Tags

PraiseWorshipThanksgiving