Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo Thanake Chellunu Gaaka

ఘనత మహిమ ప్రభుకే తర తరములలో తనకే చెల్లును గాక

Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo Thanake Chellunu Gaaka

Verse
ఘనత మహిమ ప్రభుకే
తర తరములలో తనకే చెల్లును గాక
Verse
నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదము
అద్భుతములను చేయు దేవుడు వినుతించెదము విమలాత్ముడని
Verse
పావన ప్రభుయేసుండు పరమ దీవెనలు మనకిచ్చెను
తరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతియించెదము
Verse
మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగాను
తన శిరసత్వములో మనలుంచి మనల నడుపు రారాజునకే
Verse
మాట తప్పని దేవుడేగ మేటిగ నెరవేర్చె వాగ్దానము
ధీటైన జనముగ మము జేసెనుగ మెండుగ మమ్ము దీవించెనుగా
Verse
పరమప్రభువు మనకొరకు అర్పించుకొనెను తన్ను తానే
సర్వము మనకు యిచ్చిన ప్రభునే సర్వద మనము స్తుతియించెదము

Related Tags

PraiseWorshipGlory