Chorus
ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడి
యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం
బొప్పుచుండనో జనులార‖ ఘనుఁడైన ‖
Verse
ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు
సంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే
మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె మృత్తుచే
మానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁ
దిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా‖ ఘనుఁడైన ‖
Verse
మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో
మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను
భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ బొందైన నీ నగరి కా
ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగఁ జేయు దేవా యో
జనులారా‖ ఘనుఁడైన ‖
Verse
ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన
కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్
నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ
పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా‖ ఘనుఁడైన ‖