Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gnaanulu choodavelliri bethlehemu puramunaku

జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము పురమునకు

Gnaanulu choodavelliri bethlehemu puramunaku

Lyricist: Samy Pachigalla
Verse
జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము పురమునకు
పశువుల పాకలో పరుండిన యేసుని చూచి
సంతోషించి ఆరాధించిరి
చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి
చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి
Verse
ప్రేమను ఇచ్చి విమోచన తెచ్చి
మానవాళి స్థితిని మార్చుటకై
జీవ మార్గమును బహుకరించిన
చిన్ని యేసు రాజు జన్మించే
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఆయనకిష్టులైన వారికి ఇల సమాధానం
Verse
రాజుల రాజుగా భువిపైకరుదెంచి
ఇమ్మానుయేలుగా జన్మించెనే
లోకమునకు వెలుగును ప్రసాదించి
మనకు ఆనందం తెచ్చెనే
చిన్ని యేసు దేవుడని చాటి చెప్పిరి
క్రీస్తుయేసు దేవుడని చాటి చెప్పిరి

Related Tags

JesusChristmasBirth