Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gnaapakam Cheasukoa Yesayyaa

జ్ఞాపకం చేసుకో యేసయ్యా

Gnaapakam Cheasukoa Yesayyaa

Lyricist: Rev Pandu Premkumar
Verse
జ్ఞాపకం చేసుకో యేసయ్యా
దారి తప్పిన ఈ గొఱియను
జ్ఞాపకం చేసుకో మెస్సియ్యా
జారిపడిన ఈ నాణెమును
Verse
కనులుండి గ్రుడ్డివాడినై
గుంటలో పడితిని నా యేసయ్యా
కాళ్ళుండి కుంటివాడనై
ఊభిలో దిగితిని నా మెస్సియ్యా
చేయిచాచి నా చేయి పట్టి
లేవనెత్తుము నా యేసయ్యా
చెవులుండి చెవిటివాడనై
నీ స్వరమును విననైతిని నా యేసయ్యా
నోరుండి మూగవాడనై
నీ మాటను మరచితి నా మెస్సియ్యా
జాలితలిచి కన్నీరు తుడిచి
బ్రతికించుము నా మెస్సియ్యా

Related Tags

PrayerRepentanceMercy