Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gonthu Etthi Chaatedaanu

గొంతు ఎత్తి చాటెదాను

Gonthu Etthi Chaatedaanu

Verse
గొంతు ఎత్తి చాటెదాను
నడుము కట్టి పయనింతును
నా యేసు గొప్పవాడు‖ 4x ‖
నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు
నీ కొరకే నేనన్నాడు‖ 2x ‖
నా యేసు గొప్పవాడు‖ 4x గొంతు ‖
Verse
ఎంత గొప్ప కార్యము చేసినాడు
ఎర్ర సంద్రమునే చీల్చినాడు
ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు
యెరికో గోడలు కూల్చినాడు‖ 2x ‖
ఎంతాటి కార్యమైనా చేయగలడు
శక్తివంతుడు అసాధ్యుడు‖ 2x ‖
నా తండ్రి గొప్పవాడు‖ 4x గొంతు ‖
Verse
ఎంత గొప్ప కార్యము చేసినాడు
నిషేధించిన రాయి స్థానం మార్చాడు
పనికిరాని పాత్రను వాడగలడు
గొప్పదైన దానిగా చేయగలడు‖ 2x ‖
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు
ఎంత గొప్ప దేవుడు నా యేసుడు‖ 2x ‖
నా యేసు గొప్పవాడు‖ 4x గొంతు ‖
Verse
కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది
నా యేసు తండ్రి చూపుతాడు
ఈ లోక స్నేహం ఇవ్వలేనిది
నా యేసు ప్రాణం ఇచ్చినాడు‖ 2x ‖
ఎన్నాడు విడువని గొప్ప దేవుడు
లోకమంతా విడిచినా నిన్ను విడువడు‖ 2x ‖
నా యేసు గొప్పవాడు‖ 4x గొంతు ‖

Related Tags

PraiseWorshipTestimony