Verse
గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి‖ 2x ‖
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా‖ 2x ‖
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా‖ గూడు ‖
Verse
గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం‖ 2x ‖
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా‖ 2x నా ప్రాణమా ‖
Verse
చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం‖ 2x ‖
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా‖ 2x నా ప్రాణమా ‖