Verse
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై‖ 2x ‖
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై‖ 2x ‖
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను‖ 2x ‖
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని‖ 2x ‖
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది‖ 2x గూడు ‖
అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని‖ 2x ‖
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది‖ 2x గూడు ‖
అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని‖ 2x ‖
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి‖ 2x ‖
గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై‖ 2x ‖
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై‖ 2x ‖
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను‖ 2x ‖
యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో‖ 4x ‖