Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Goppa Deva Naaku Thandrivi Yaakashama

గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమ

Goppa Deva Naaku Thandrivi Yaakashama

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి
తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత
నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము‖ గొప్ప ‖
Verse
నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు
భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు
నిలిపి కావు మనుచు వేఁడుకొందు‖ గొప్ప ‖
Verse
చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు
సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు
మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు‖ గొప్ప ‖
Verse
విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు
చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ
గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని‖ గొప్ప ‖
Verse
మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే
సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ
బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి‖ గొప్ప ‖

Related Tags

PraiseWorshipFather