Verse
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా‖ 2x గొప్ప ‖
Verse
అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని‖ 2x ‖
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను‖ 2x హల్లెలూయా ‖
Verse
సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని‖ 2x ‖
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్‖ 2x హల్లెలూయా ‖