Verse
గొప్పా దేవుడవని శక్తి సంపన్నుడని - గలమెత్తి నిన్ను నేను గాణమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ‖ 2x ‖
Verse
అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్యకార్యములు చేయగలవని
అద్వితీయుడవని ఆది సంభూతుడని - ఆరాధించెద నిత్యము నిన్ను
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ
Verse
సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను కూల్చినావని
సర్వోతున్నవడని సర్వసంపన్నుడని - సాక్ష్యగీతము నే పాడెదన్
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ