Verse
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం
పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి‖ 2x ‖
ప్రేమామయుడు మహిమాన్వితుడు
ఉన్నవాడు అనువాడు‖ 2x ‖
మహిమ ఘనత నిత్యం యేసుకు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్‖ గొప్పవాడు ‖
Verse
ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు
నీ పాప జీవితం మార్చేవాడు యేసు‖ 2x ‖
నీ బాధలన్ని తీర్చేవాడు యేసు
సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు‖ 2x మహిమ ‖
Verse
నీ రోగాలను స్వస్థపరచునేసు
నీ శాపాలను తీసివేయునేసు‖ 2x ‖
నీ శోకాలను మాన్పివేయునేసు
పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు‖ 2x మహిమ ‖