Verse
గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి‖ 2x ‖
Verse
సర్వాధికారియు సర్వోన్నతుండైన‖ 2x ‖
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము‖ 2x గొర్రెపిల్ల ‖
Verse
సిద్ధపడెను వధువు సుప్రకాశము గల‖ 2x ‖
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్‖ 2x గొర్రెపిల్ల ‖
Verse
పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు‖ 2x ‖
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు‖ 2x గొర్రెపిల్ల ‖
Verse
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు‖ 2x ‖
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు‖ 2x గొర్రెపిల్ల ‖
Verse
దేవుని వాక్యమను నామము గలవాడు‖ 2x ‖
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె‖ 2x గొర్రెపిల్ల ‖
Verse
ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు‖ 2x ‖
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్‖ 2x గొర్రెపిల్ల ‖
Verse
శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు‖ 2x ‖
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె‖ 2x గొర్రెపిల్ల ‖