Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gorrepilla Vivaahotsava Samayamu Vachchenu Randi

గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి

Gorrepilla Vivaahotsava Samayamu Vachchenu Randi

Verse
గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి
Verse
సర్వాధి కారియు - సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము
Verse
సిద్ధపడెను వధువు - సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్
Verse
పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు
గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
Verse
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు
Verse
దేవుని వాక్యమను - నామము గలవాడు
రక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె
Verse
ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్
Verse
శ్రీయేసుక్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె

Related Tags

PraiseWeddingRevelation