Verse
గ్రీన్లాండ్ దేశస్థులును
ఇండియా జనులున్
ఆఫ్రికా ఖండమందు
నివాసులెల్లరు
సముద్ర ద్వీపస్థులు
సువార్త వెలుగు
మాకు నిప్పించుడని
మమ్మును పిల్తురు.
Verse
మా దేవుడిచ్చు సుఖ
సుక్షేమ యీవులు
ఒక్కొక్క దేశమందు
విస్తారమైనను
అజ్ఞానులైనవార
లా సత్య దేవుని
గొల్వక వేరువాటిన్
పూజించుచుందును.
Verse
సువార్తకాంతి మాకు
ప్రకాశమైనదా
అజ్ఞానులందరికి
దాని మేమియ్యమా
రక్షణ దివ్యవార్త
లోకస్తులెల్లరు
విని మా యేసుమీద
విశ్వాసులౌదురు.
Verse
సుక్షేమకరమైన
సువార్త సంగతి
గాలి తరంగములు
వ్యాపింపజేయుడీ
మా సృష్టికర్త రాజు
నిర్దోషి యాయనే
మా యేసు దిగి వచ్చి
యీ లోకమేలును.