Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gunavanthuralaina Ghanamaina Streeye Goppadi Yentho Velagala Muthyamu Kanna

గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న

Gunavanthuralaina Ghanamaina Streeye Goppadi Yentho Velagala Muthyamu Kanna

Chorus
గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే
గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న
Verse
క్రీస్తేసు రక్తములో కడుగబడి - కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే
కొనియాడ తగినది ధన్యురాలు తానే
Verse
నీ జనమే నా జనమని ఎంచుకొని - నిజదేవుని వెదకి వెంటాడిన రూతు
కొనియాడ తగినది ధన్యురాలు తానే
Verse
దేవుని సన్నిధిలో ప్రార్థించగా - దేవుడు హన్నా ప్రార్థన వినెను
కొనియాడ తగినది ధన్యురాలు తానే
Verse
ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి - యుద్దము జయించెను దెబోరా
కొనియాడ తగినది ధన్యురాలు తానే
Verse
నేను నశించిన నశించెదనని - తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె
కొనియాడ తగినది ధన్యురాలు తానే
Verse
ఆభరణ వస్త్రాలంకారముగాక - అక్షయాలంకారము కల్గిన స్త్రీయే
కొనియాడ తగినది ధన్యురాలు తానే
Verse
ప్రభుయేసుని గుణగణములను కల్గి - పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే
కొనియాడ తగినది ధన్యురాలు తానే

Related Tags

Christian LifeVirtuous WomanProverbs