Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Gunde Baruvekkipothunnadi

గుండె బరువెక్కిపోతున్నది

Gunde Baruvekkipothunnadi

Verse
గుండె బరువెక్కిపోతున్నది
ప్రాణము సొమ్మసిల్లుచున్నది‖ 2x ‖
నా మనసేమో కలవరపడుచున్నది‖ 2x ‖
యేసయ్యా.. ఆదరించ రావా
యేసయ్యా.. బలపరచ రావా‖ గుండె ‖
Verse
ప్రాకారము లేని పురముగా నేనుంటిని
ఆదరణ లేక దిగులుతో నేనుంటిని‖ 2x ‖
నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే‖ 2x ‖
యేసయ్యా.. ఆధారం నీవే కదా
యేసయ్యా.. నా కాపరి నీవే కదా‖ గుండె ‖
Verse
అంధకారంలో నా దీపము ఆరిపోయెనే
అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే‖ 2x ‖
దినదినము నేను కృంగుచున్నాను‖ 2x ‖
యేసయ్యా.. వెలిగించగ రావా
యేసయ్యా.. లేవనెత్త రావా‖ గుండె ‖
Verse
ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే
ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే‖ 2x ‖
ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా‖ 2x ‖
యేసయ్యా.. దర్శించ రావా
యేసయ్యా.. ప్రేమతో నింపుమయా‖ గుండె ‖

Related Tags

PrayerComfortHope