Verse
గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం‖ 4x ‖
Verse
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు‖ 2x ‖
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను‖ 2x ‖
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని‖ గుర్తుండిపోయే ‖
Verse
నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై‖ 2x ‖
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను‖ 2x ‖
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని‖ గుర్తుండిపోయే ‖