Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ha Rakshanampu Bavulellanu Anthuleni Lothugalavi

హా రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి

Ha Rakshanampu Bavulellanu Anthuleni Lothugalavi

Verse
బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప
కల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకును
Chorus
హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి
ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున
Verse
నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు
విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు
Verse
ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు
తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును
Verse
కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం
ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు
Verse
జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి
భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి

Related Tags

PraiseSalvationLiving Water