Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Haa Yaanandha Sudhinamu Naa Yesun Na

హా యానంద సుదినము నా యేసున్ న

Haa Yaanandha Sudhinamu Naa Yesun Na

Lyricist: Philip Doddridge
Verse
హా! యానంద సుదినము
నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
భాగ్యమౌ దినము‖ భాగ్యమౌ దినము ‖
ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్థన లేసుఁడు
ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న దినము
Verse
ప్రభునితో నిరంతమౌ
నిబంధనఁ జేసికొంటి
నేఁబుట్టితి నింపొందఁగ
విభుని పాదపద్మము.
Verse
నా యాత్మ, శాంత మొందుము
నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము.
Verse
నే నేసువాఁడ నేసుఁడు
నిత్యంబు నా వాఁ డాయెను
ఇదెంత గొప్ప భాగ్యము
నేనేసు యొక్క మిత్రుఁడన్
Verse
నేఁ జేసెడి యొప్పందము
ఎల్లడ నెఱవేర్తును
నేఁ జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి పాడుదు.

Related Tags

CommitmentSalvationJoy