Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hae Prabhuyesu Hae Prabhu Yesu Hae

హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే

Hae Prabhuyesu Hae Prabhu Yesu Hae

Lyricist: A B Masilamani
Chorus
హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా
పాపహరా, శాంతికరా‖ హే ప్రభు ‖
Verse
శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా,
జీవనదీపా శాంతి సువార్తనిధీ‖ సిల్వధరా ‖
Verse
తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు
జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా‖ సిల్వధరా ‖
Verse
మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు
దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా‖ సిల్వధరా ‖
Verse
పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల
మాడిన మానవహృదయము కలకలాడెకదా‖ సిల్వధరా ‖
Verse
కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని
సిల్వపతాకము దానము జేసెగదా‖ సిల్వధరా ‖
Verse
దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో
సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా‖ సిల్వధరా ‖
Verse
పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి
పాపిని బ్రోచిన కాపరి వీవెగదా‖ సిల్వధరా ‖
Verse
ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు
సాతానుని గర్వము ఖండనమాయెగదా‖ సిల్వధరా ‖
Verse
కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష
ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా‖ సిల్వధరా ‖

Related Tags

SalvationJesusPeace