Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halelooya Yani Paadudee Samaadhipai Vela

హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెల

Halelooya Yani Paadudee Samaadhipai Vela

Lyricist: Kadiyam Gabriel
Verse
హలెలూయ యని పాడుఁడీ సమాధిపై వెలుఁ గేమొ పరికించుఁడీ
కలఁడు యేసు సజీవుఁడయి, లే ఖనముల లవి నెరవేరెను కలిమి మోదము
గులగ, దివి నుతి సలువ మహిమను వచ్చును‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాఁడుడీ యీ జగతికిఁ కలిగె రక్షణ చూడుఁడీ
శిలఁ దొలంగెను, ముద్ర విడె, కా వలి సమాజము దేవుని బలిమి కాగక
పారిపోయెను గలిబి లాయెను నరకము‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ చీఁకటిపైని వెలుఁగే జయ మొందుసుండీ
యిలను మృత్యువు గూలె, బ్రతికెఁగా యల విశ్వాసము మరలను
బలనిరీక్షణ మనకుఁ గలిగెను బ్రతిహృదయము బలపడెన్‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ దుఃఖించు నో చెలియలారా వినుఁడీ
సొలయకుండఁగ మీర లటునిటు చూచుచుండుట యెవరిని ఫలము
లేదిఁక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ యేసు ప్రభుని వలననే గలిగెఁగనుఁడీ
యిలయుఁ బరమును సఖ్యపడియెను గలిగె హర్షము చావుచే సిలువ
చింతలు మాని, పొందుఁడి కలకలంబగు మోదము‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ మీ భూరి చిం తలుతీరె మది నమ్ముఁడీ
బలహీనపు చిన్న మందా! ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము
మిమ్ము నాయన కరుణతో నడుపును సదా‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ సంఘము సదా నిలిచి యుండును సుమండీ
పలు తెరంగుల రిపుల వలనను బాధ లెన్నియుఁ గలిగినన్ దొలఁగ
కేమియు నన్ని యడ్డుల గెలిచి వర్ధిల్లుచుండును‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ దేవుని బోధ కులు సర్వరాష్ట్రంబుల
నెలమి మహిమకుఁ బ్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుఁ
గువలెఁ బ్రసరింపఁ జేయుదు రిలను ధృతితో నేర్పుతో‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ భక్తులారా విలపింపవలదు సుండీ
కలుగకుండుఁడి సందియంబులు గడుచు కాలము శీఘ్రమే కలుగు మీకు
సమాధి మిమ్మును గౌఁగిలింప నెమ్మది‖ హలెలూయ ‖
Verse
హలెలూయ యని పాడుఁడీ గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరల
ఇల ప్రభువు తన పంటఁ గూర్పను నేగుదెంచును జివరను తొలఁగఁ
జేయును గురుగులను గో ధుమలనుండి నిజంబుగా‖ హలెలూయ ‖

Related Tags

PraiseResurrectionEaster