Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelooya Paadudi Hallelooya Paadudi

హల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి

Hallelooya Paadudi Hallelooya Paadudi

Verse 1
Reference: ప్రభువును స్తుతించుడి (హల్లెలూయ) రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును .... ప్రకటన Revelation 19:1
Chorus
హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి
హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ పాడుడి - హల్లెలూయ పాడుడి
Verse
క్రీస్తు మనకు రక్షణ నొసగెన్ విడిపించె మనల తనదు రక్తముతో
గొప్పదైన నిజమైన అద్భుత రక్షణ యిదే
అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
Verse
మహిమ దర్శన మనుగ్రహించె పరమ వైభవమును చూపించె
మహిమ ఘనత స్తుతి ప్రభావములన్నియు ఆయనవే
అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
Verse
ఘనపరచుడి సజీవ క్రీస్తున్ జీవితములో జూపుడాయనన్
ధనికులుగ మనలను ప్రేమతో తానే జేసెన్
అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
Verse
నిత్యమగు తన శక్తితో కాయున్ ప్రభు శరణు జొచ్చిన వారిన్
అధిక జయం సాహసమున్ అన్నియు మనవాయెన్
అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
Verse
ఏమి వచ్చినన్ జీవితయాత్రలో - ఆమెన్ అనుచు సహించెదము
శ్రమలలోనే శాంతి యుండున్ - అద్భుత యానందము
అందుకొరకై పాడుడి - హల్లెలూయ పాడుడి
Verse
దేవునికి భయపడు వారలారా చిన్నలైన మీరు పెద్దలైనను
ఆయనకే యుగములందు స్తుతి చెల్లును గాకని
మీరందరు పాడుడి - హల్లెలూయ పాడుడి

Related Tags

PraiseWorshipRevelation