Verse
హల్లెలూయ పాటలతో
ఆనంద గీతాలతో‖ 2x ‖
కృపామయుండా నీ మేలులన్ని
స్మరించి స్తుతింతును‖ 2x ‖
Verse
నేనారణ్యా యానములో
నిను పలుమార్లు విసిగించినా‖ 2x ‖
కోపించుచునే వాత్సల్యము చూపి
అనుదినము నను మరువక
మన్నాను నాకిడితివి‖ 2x హల్లెలూయ ‖
Verse
మలినంబైన వలువలతో
నే నీ ఎదుట నిలుచుండగా‖ 2x ‖
కృపతో నా నేరములను క్షమియించి
పరిశుద్ధ వస్త్రములతో
నన్నలంకరించితివి‖ 2x హల్లెలూయ ‖
Verse
నే కృంగిన వేళలలో
నీ అభిషేక తైలముచే‖ 2x ‖
పక్షిరాజు యవ్వనము వలె నా బలము
నూతనము జేసితివి
నను పైకెగుర జేసితివి‖ 2x హల్లెలూయ ‖