Verse
హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారే జనులారా ఊరూరా నోరారా‖ హల్లేలూయా ‖
Verse
పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని‖ 2x ‖
కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని‖ 2x ‖
తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని‖ 2x ‖
పూజించి… పూజించి పాటించి చాటించ రారే‖ హల్లేలూయా ‖
Verse
బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని‖ 2x ‖
అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని‖ 2x ‖
కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని‖ 2x ‖
పూజించి… పూజించి పాటించి చాటించ రారే‖ హల్లేలూయా ‖
Verse
రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని‖ 2x ‖
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని‖ 2x ‖
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని‖ 2x ‖
పూజించి… పూజించి పాటించి చాటించ రారే‖ హల్లేలూయా ‖