Verse 1
హల్లేలూయని పాడరండి
విజయుడైన యేసునకు‖ 2x ‖
మరణము గెలిచె గదా
మహిమతో లేచె గదా‖ 2x హల్లేలూయని ‖
Verse 2
పాప బలము మరణ భయము
లేదు ఈ జగతిలో‖ 2x ‖
మరణపు ముళ్ళు విరిచివేసెను‖ 2x ‖
నిత్య జీవమిచ్చెనుగా‖ హల్లేలూయని ‖
Verse 3
ఖాళి సమాధి కనుపరచెనుగా
పునరుత్తాన వార్తను‖ 2x ‖
జీవము నిండిన దేవుడిలలో‖ 2x ‖
యేసు క్రీస్తు ప్రభువొక్కడే‖ హల్లేలూయని ‖