Verse
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక
Verse
పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసె
హోసన్నా హోసన్నా హృదయమర్షించును
Verse
గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగా
పరలోక దర్శనమును జగమంతా పొందును
Verse
సకల జనములారా రండి ఆరాధించెదము
పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము