Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు

Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

Verse
హల్లెలూయ నా ప్రాణమా - యెహోవాను స్తుతించు
Verse
నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను
నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును
Verse
రాజుల చేతనైనను - మరి నరుల చేతనైనను
రక్షణ్య భాగ్యము కల్గదు - వారిని నమ్ముకొనకండి
Verse
వారి ప్రాణము నశియించును - వారు మంటిలో గలసెదరు
వారి సంకల్పములన్నియు నీ దినమే నాశనము నొందున్
Verse
యాకోబు దేవుండు - ఎవ్వనికి సాయంబగునో
యెవడెహోవా మీద ఆశపెట్టునో - వాడే ధన్యుడు
Verse
ఆకాశ భూమి సముద్రం - దానిలోని దంత సృజించెన్
ఆ తండ్రి యెన్నండైన తన మా-టలు తప్పనివాడు
Verse
బాధ నొందినవారికి - అతడే న్యాయము తీర్చున్
ఆకలిగొనినట్టి వారికి ఆ - హారము దయచేయున్
Verse
బంధింపబడిన వారికి బంధములాయన ద్రుంచున్
పుట్టంధుల కన్నులను యెహోవా తెరవజేసెడివాడు
Verse
క్రుంగినట్టి జనుల - నింగికెత్తెడు వాడాయనే
నీతిమంతుల నెల్లరిని యెహోవా ప్రేమించున్
Verse
పరదేశ వాసులను - కాపాడు వాడాయనే
వేరుదిక్కులేని వారిని విధవల నాదరించును
Verse
భక్తిహీనుల దారిని - వంకరగా జేయును
యెహోవాయే తరతరములు పరిపా - లించుచుండును
Verse
సీయోను నీ దేవుడు - తరతరములు రాజ్య మేలును
యెహోవాను స్తుతించుడి - హల్లెలూయా ఆమెన్

Related Tags

PraisePsalm