Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hallelujah Paadeda Prabhu Ninnu Koniyaadedan

హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

Hallelujah Paadeda Prabhu Ninnu Koniyaadedan

Chorus
హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
Verse
వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
Verse
నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు - నా రక్షణ శృంగము నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
Verse
ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
Verse
భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
Verse
కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
Verse
ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

Related Tags

PraiseWorshipThanksgiving