Chorus
హల్లెలూయ స్తోత్రం యేసయ్య‖ 2x ‖
గడిచిన కాలము క్రుపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రం
పగలు రేయి కనుపాప వలె కాచిన దేవా నీకే స్తోత్రం
మము దాచిన దేవా నీకే స్తోత్రం
కాపాడిన దేవా నీకే స్తోత్రం
Verse
కలత చెందినా కష్ట కాలమునా కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చినా కాదనకా నను కరుణించినా
కరుణించిన దేవా నీకే స్తోత్రం
కాపాడిన దేవా నీకే స్తోత్రం
Verse
లోపములెన్నో దాగి ఉన్ననూ దాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసినా
దీవించిన దేవా నీకే స్తోత్రం
దయచూపిన తండ్రీ నీకే స్తోత్రం