Verse
హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి
Chorus
రాజుల రాజైన యేసు రాజు - భూజనులనేలున్
హల్లెలూయ హల్లెలూయ - దేవుని స్తుతియించుడి
Verse
తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళములన్ - మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి
Verse
సూర్య చంద్రులారా ఇల - దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లారా మీరు - కర్తను స్తుతియించుడి
హృదయమును ఒప్పించిన - నాధుని స్తుతియించుడి
Verse
యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి
Verse
అగాధమైన జలములారా - దేవుని స్తుతియించుడి
అలల వలె సేవకులు - లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి